విడాకుల వార్తపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేసిన శ్రీకాంత్..!

-

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు విలన్ గా పలు పాత్రలు పోషిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదిలా ఉండగా హీరో శ్రీకాంత్ భార్య ఊహకు విడాకులు ఇస్తున్నారంటూ ఒక వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇన్నేళ్ల కాపురానికి శ్రీకాంత్, ఊహ పులిస్టాప్ పెట్టబోతున్నారనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాజాగా దీనిపై మరొకసారి రియాక్ట్ అయ్యారు శ్రీకాంత్.

రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పై కూడా రకరకాల రూమర్సు స్ప్రెడ్ చేశారు.. కోట ఇక లేరంటూ వార్తలు రావడంతో ఆయన స్వయంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇలాంటి విషయాలు సెలబ్రిటీలను చాలా బాధ పెడుతున్నాయని తెలిపారు.. కొంతమంది సోషల్ మీడియాను తప్పుగా వాడుతున్నారని.. ముఖ్యంగా యూట్యూబర్స్.. వీడియోలకు పెట్టే థంబ్ నెయిల్స్ చూస్తుంటే చాలా బాధగా ఉంది అంటూ శ్రీకాంత్ తెలిపారు.

ఒకానొక సమయంలో నేను చనిపోయినట్టు రాసారు.. ఇప్పుడు ఊహాతో విడాకులని రాశారు.. ఇలాంటివి ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడతాయని తెలిపారు తాను తట్టుకున్నా.. ఫ్యామిలీ మెంబర్స్ తట్టుకోలేరని శ్రీకాంత్ తెలిపారు.ఇలాంటి రూమార్స్ క్రియేట్ చేసే వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నా తప్పు లేదని .. మళ్లీ ఇలాంటి వార్తలు పుట్టించకుండా గట్టిగా యాక్షన్ తీసుకోవాలని కూడా తెలిపారు. ఈ విషయంలో ఎవరికి వారుగా మారితే తప్ప ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది అంటూ మరొకసారి అసహనం వ్యక్తం చేశారు శ్రీకాంత్.

సాధారణంగా శ్రీకాంత్ భార్య ఊహ ఎక్కువగా బయట కనిపించదు.. ఆమెకు అలాంటివి పెద్దగా ఇష్టం కూడా ఉండదు.. కానీ ఇప్పుడు రకరకాల వార్తలు పుట్టుకొస్తుండడంతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆమెను వెంటబెట్టుకొని వెళ్తున్నాను అంటూ శ్రీకాంత్ చెప్పడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఈ వార్తలు ఆ ఫ్యామిలీని ఎంతగా ఇబ్బంది పెట్టాయో అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version