అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

-

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒహైయో రాష్ట్రంలోని ప్రముఖ నగరం డేటన్ సమీపాన ఉన్న బట్లర్ టౌన్‌షిప్ అనే చిన్న పట్టణంలో మరోసారి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు హత్యకు గురయ్యారు. నిందితుడు కారులో ప్రయాణిస్తూ.. ఆయా ప్రాంతాల్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే స్టీఫెన్ మన్రోగా నిందితుడు అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

అమెరికా- కాల్పులు
అమెరికా- కాల్పులు

అయితే నిందితుడి చేతిలో గన్ ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు అతను ప్రయాణిస్తున్న కారు ఫోటోలను విడుదల చేశారు. అయితే దుండగుడు ఏ లక్ష్యంతో కాల్పులు జరుపుతున్నాడనే విషయంపై క్లారిటీ లేదన్నారు. నిందితుడు ఇండియానా పోలీస్, లెక్సింగ్టన్, కెంటకీ, షికాగో నగరాల్లో ఉండి ఉంటాడని పోలీసులు అనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news