BREAKING : తిరుమలలో తొక్కిసలాట..పరిస్థితి ఉద్రిక్తత.. భక్తులకు గాయాలు

-

తిరుమల శ్రీవారి సన్నిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం నుంచి తిరుమల శ్రీవారి నీ దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. అయితే రెండు రోజులుగా టోకెన్ల జారీని టిటిడి పాలక మండలి అధికారులు నిలిపివేశారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలలో నిలిచి పోయారు. టోకెన్లు పంపిణీ చేసే రెండవ సత్రం, అలిపిరి వద్దకు ఇసుక వేస్తే రాలనంత భక్తులు వచ్చారు.

అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తీసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. టిటిడి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే… టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శనం టికెట్లు పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుమలలో ప్రతి రోజు 30 వేల ఉచిత టిక్కెట్ల టీటీడీ పాలకమండలి ఇస్తోంది. భక్తుల రద్దీ పెరగడంతో ఉచిత టిక్కెట్లను 45 వేలకు పెంచాలని టితిడి కీలక నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news