ఆ విషయంలో దిగివస్తున్న స్టార్ హీరోస్.. దిల్ రాజు తో భేటీ..!!

-

కరోనా కారణంగా ఎక్కువగా నష్టపోయిన పరిశ్రమ ఏదైనా ఉందంటే అది కేవలం చిత్ర పరిశ్రమ అని మాత్రమే చెప్పాలి. ముఖ్యంగా చాలామంది సినిమా ఇండస్ట్రీపై ఆధారపడి బతికిన ఎంతోమంది కార్మికులు, సినీ నటులు అందరూ కూడా సినిమా షూటింగులు లేక డబ్బులు లేక మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సినీ పెద్దలు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతులు కూడా తీసుకొచ్చారు. ఇకపోతే ఆ టికెట్ రేట్లతో పాటు ఓటీటీ వేదికలు కూడా ఇప్పుడు నిర్మాతల పాలిట గుదిబండగా మారుతున్నాయి.. ఎంత ఎత్తు పెరిగినా.. విరుగుట కొరకే అన్నట్లుగా నిన్నటి మొన్నటి వరకు పారితోషకం విషయంలో ఆకాశమే హద్దుగా సాగిన హీరోల పారితోషకం కి ఇప్పుడు బ్రేక్ పడిందని చెప్పవచ్చు.

ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెరిగిన టికెట్ రేట్లతో పాటు ఓ టి టీ లో కూడా త్వరగా సినిమాలు వస్తుండడంతో ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు థియేటర్ల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. దీంతో నిర్మాతలకు పూర్తిస్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఇక ఖర్చును భరించలేక నిర్మాతలు కూడా ఆగస్టు ఒకటవ తేదీ నుంచి షూటింగ్స్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ఇక నిర్మాతలు ఇలా బంధు ప్రకటించడంతో స్టార్ హీరోలు కూడా దిగివస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సినిమా నిర్మాణ వ్యయం రోజు రోజుకు పెరిగిపోతుండడంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.

ఇక పారితోషకం విషయమై దిల్ రాజు స్టార్ హీరోలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా పెరుగుతున్న నిర్మాణ వ్యయం అలాగే ఇతర ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పారితోషకం తగ్గించుకునేందుకు అల్లు అర్జున్ , రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు కూడా ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికైనా షూటింగుల బందు విషయమై నిర్మాతల మండలి చిరంజీవికి ఒక లేఖ కూడా రాశారు. కాస్ట్ కటింగు, రెమ్యూనరేషన్ విషయంపై ఓ నిర్ణయం తీసుకునేలా ఆ లెటర్లో మిగతా విషయాలను కూడా పొందుపరిచారు. పూర్తి సమాచారం మరికొద్ది రోజుల్లోనే తేలనుంది .

Read more RELATED
Recommended to you

Latest news