సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడిగా కూడా పేరు పొందాడు. ఇక బస్ కండక్టర్ నుంచి సినిమాల్లో ఇంత వరకు రజనీకాంత్ ఒక విభిన్నమైన స్టైలే మెయింటైన్ చేస్తూ ఉండేవారు. ఆ స్టైల్ తోనే తనని నటుడుగా మార్చింది. గతంలో వరుస హిట్లతో దూసుకుపోతున్న ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు రజినీకాంత్. రజనీకాంత్ తన బాడీతో ఎలాంటి పని చేసినా కూడా అది స్టైల్ గా అనిపించేది అంతలా ఇష్టపడేవారు ఆయన అభిమానులు.
ఈ చిత్రం తమిళంలో భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాలు తెలుగులో కూడా విడుదల చేయడానికి సురేష్ కృష్ణ ఇద్దరు స్టార్ హీరోలతో చేయాలనుకుంటున్నారట. అందులో బాలకృష్ణ ఒకరు ఇక బాలకృష్ణ కు ముందుగా రీమేక్ సినిమాలంటే ఇష్టం లేకపోవడంతో ఈ సినిమాకి దూరంగా ఉన్నారట.
ఇక చిరంజీవిని అనుసరించగా చిరంజీవి కి ఎందుకో ఈ సినిమా ఒప్పుకోవాలనిపించలేదట. అయితే వీరిద్దరి కోసం బాషా నిర్మాతలు సైతం దేవిశ్రీ థియేటర్ లో ఒక స్పెషల్ షో కూడా వేశారట. కానీ ఈ చిత్రం ఎవరికీ నచ్చకపోవడంతో రజనీకాంత్ తోనే తెలుగులో విడుదల చేశారు. దీంతో మంచి రికార్డులను సైతం సృష్టించింది ఈ చిత్రం.