అపుడప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలంటి ఒక అద్భుతమైన ఘట్టానికి నాంది రెండు సంవత్సరాల క్రితమే పడింది. 2021 లో యూఎస్ ఓపెన్ ఆడుతున్న సమయంలో స్టార్ టెన్నిస్ మహిళా ప్లేయర్ ముగురుజా తన అభిమాను అని చెప్పుకుని తనతో సెల్ఫీ తీసుకుని విషెస్ చెప్పాడట. అయితే ఆ తర్వాత నుండి ఇద్దరికీ ఒకరిపై మరొకరికి అఫెక్షన్ ఏర్పడి అది ప్రేమగా మారిందట. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారట. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆర్థర్ కూడా ఫాషన్ రంగంలో మంచి స్థాయిలో ఉన్నాడని తెలుస్తోంది.
అదృష్టం అంటే అతనిదే: అభిమానిని పెళ్లిచేసుకోనున్న స్టార్ ప్లేయర్…
-