స్టేట్ బ్యాంక్ నుండి అదిరే స్కీమ్… చూసుకోక్కర్లేదు.. ప్రతి నెలా చేతికి డబ్బులు..!

-

ఈ రోజుల్లో చాలా మంది డబ్బులని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే నిజానికి ఇలా డబ్బులని పొదుపు చేసుకుంటే మంచిగా లాభాలు ఉంటాయి. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. స్టేట్ బ్యాంక్ చాలా రకాల పథకాలను అందుబాటు లోకి తీసుకొచ్చింది. వీటి తో ఎన్నో లాభాలని పొందవచ్చు. పలు రకాల బెనిఫిట్స్ ని వాటితో అందుకోవచ్చు. ఒకసారి కనుక ఇందులో డబ్బులు పెడితే ప్రతీ నెలా కూడా డబ్బులు వస్తాయి.

స్టేట్ బ్యాంకు లో అదిరే స్కీమ్ అందుబాటులో ఉంది. దీనిలో కనుక చేరితే గరిష్ఠంగా 10 ఏళ్ల పాటు ప్రతి నెలా డబ్బులు వస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ చాలా బెస్ట్ స్కీమ్. ఈ పథకంలో చేరడం వల్ల ప్రతి నెలా కొంత ఆదాయంగా పొందవచ్చు. ఈ స్కీమ్‌లో ఎవరైనా చేరొచ్చు. మూడేళ్ళ నుండి పదేళ్ల దాకా టెన్యూర్‌ తో నెల నెలా డబ్బులు మీకు వస్తాయి. 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలలు చొప్పున ఈ స్కీమ్ మెచ్యూరిటీ టెన్యూర్ వుంది. నచ్చినట్లు, అనువైన టెన్యూర్ ఎంచుకొని డబ్బులు డిపాజిట్ చేయవచ్చు.

కనీసం రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంతైనా ఈ స్కీమ్ తో పొందొచ్చు. ఈ యాన్యుటీ ప్లాన్ అవకాశం కల్పిస్తోంది. గరిష్ట పరిమితి ఏమి లేదు. డిపాజిట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే రాబడి ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా మీకు డబ్బులు వస్తాయి. దీంతో పాటు ఈ యాన్యుటీ స్కీమ్‌ లో ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. 75 శాతం వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందవచ్చు. దీనిలో కనుక మీరు చేరాలంటే మీ సమీప బ్రాంచ్‌కు వెళ్లి చేరవచ్చు.

ఏకమొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో కొంత భాగం, వడ్డీ కలిపి ప్రతీ నెలా మీకు డబ్బులు వస్తాయి. ఇందులో మీరు ఉదాహరణకు రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తే.. నెలకు రూ.11,870 వస్తాయి. తొలి నెల పేమెంట్‌ లో వడ్డీ రూ.6,250, ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో కొంత భాగం రూ.5,620 రెండూ కలిపి మీకు ఇస్తారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 టీటీబీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news