లక్నో జట్టును బెంగళూరు చిత్తు చేసింది. లక్నోతోజరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. .. 163 పరుగులకే పరిమితమైంది. దీంతో విజయం బెంగళూరును వరిచింది. పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ… మరోసారి డికాక్ విఫలం అయ్యాడు. 3 పరుగులకే డికాక్ ఔట్ అయ్యాడు. మనీష్ పాండే మళ్లీ నిరాశ పరిచాడు.
అయితే.. ఈ మ్యాచ్ లో హజలవుడ్ వేసిన 19 వ ఓవర్ మ్యాచ్ నే మలుపు తప్పేసింది. అయితే.. 19 వ ఓవర్ మొదటి బంతికి వైడ్ ఇవ్వకపోవడంపై అంపైర్ పై అసహనం వ్యక్తం చేశాడు స్టోయినిస్. ఆ తర్వాతి బంతికే మార్కస్ స్టోయినిస్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు హజల్ వుడ్.
అంపైర్ ను బూతులు తిడుతూ.. పెవిలియన్ చేరిన స్టోయినిస్, తన పక్క నుంచి వెళుతున్న ఓ ఆర్సీబీ ప్లేయర్ పై కి బ్యాట్ ఎత్తాడు. మళ్లీ దించి.. కోపంగా డగౌట్ కు వెళ్లాడు. మార్కస్ స్టోయినిస్, అంపైర్ తో దురుసు ప్రవర్థించిన కారణంగా అతన్ని మందలించి.. వదిదలేసిన రిఫరీ, లక్నో కెప్టెన్ రాహుల్ కు 20 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించింది.