ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది షుగర్, బీపీ, అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు ఇటువంటి సమస్యల నుండి దూరంగా ఉండాలంటే ఇంటి చిట్కాలుని పాటించడం మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం జీవన విధానం సహాయపడుతుంది. అలానే ఈ మధ్యకాలంలో తరచు చాలా మంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నరాల నొప్పులు, కండరాలు నొప్పులతో బాధపడుతున్నారు. వయసుకు సంబంధం లేకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.
పోషకాహార లోపం ఏ దీనికి ప్రధానమైన కారణం. పోషకాహార లోపం వలన రకరకాల సమస్యలు వస్తున్నాయి. నొప్పులు మొదలు చాలా సమస్యలతో ఎంతోమంది సతమతమవుతున్నారు. కీళ్ల నొప్పులు కండరాలు నొప్పులతో బాధపడే వాళ్ళు అరటి పండుని తీసుకుంటూ ఉండండి. కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, నిద్రలో కాళ్లు పట్టేయడం వంటి బాధలు అరటి పండు తీసుకుంటే ఉండవు అలానే బంగాళదుంపని పాల పదార్థాలని తీసుకుంటే కూడా మంచిదే.
మెగ్నీషియం అందడానికి భోజనం అయ్యాక ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి. ఐరన్ మెగ్నీషియం మీకు దొరుకుతుంది. అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, తెల్ల నువ్వులు, బాదంపప్పు వంటివి తీసుకుంటే పోషకాహార లోపం ఉండదు. మెంతుల్ని కూడా ప్రతిరోజు తీసుకుంటూ ఉండండి.
ఒక గ్లాసు నీతిలో అర టీ స్పూన్ మెంతుల్ని వేసి దాల్చిన చెక్కను కూడా వేసి రాత్రి అంతా ఉంచండి. పరగడుపున దీన్ని తీసుకుంటే రక్త ప్రసరణ బాగా అవుతుంది వాత దోషాలు కూడా తగ్గిపోతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది ఇలా చేయడం వలన అధిక బరువు సమస్య నుండి కూడా బయటపడొచ్చు. క్యాల్షియం లోపంతో బాధపడే వాళ్ళు పాలల్లో కొంచెం పసుపు వేసుకుని తీసుకుంటే మంచిది ఇలా ఈ విధంగా మీరు పాటిస్తే సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు.