సుహాస్ “ఆనందరావ్ అడ్వెంచర్స్” ఫస్ట్ లుక్ రిలీజ్

-

కలర్ ఫోటో సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సుహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాతో సుహాస్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల శైలేష్ కొలను – అడివి శేష్ కాంబోలో తెరకెక్కిన హిట్ 2 చిత్రంలో సైకో కిల్లర్ గా నటించి తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సుహాస్.

ప్రస్తుతం సుహాస్ కొత్త దర్శకుడు రామ్ పసుపులేటి దర్శకత్వంలో ఓ ఫాంటసీ చిత్రానికి సైన్ చేశాడు. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ చిత్రానికి ఆనందరావు అడ్వెంచర్స్ అనే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు మేకర్స్. సుహాస్ ఆకాశం నుండి భూమి పైకి ఉన్న ఒక అందమైన గ్రామానికి చేతిలో పాలసీసా పట్టుకొని దూసుకు వస్తూ కనిపిస్తాడు.

ఈ చిత్రాన్ని క్సాపీ స్టూడియోస్ నిర్మిస్తుంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రాకేష్ ఎస్ నారాయణ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు నిర్మాతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version