వెల్లుల్లి ఉంటే వంటలు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఆరోగ్యానికి కూడా చాలా మంచిది..అయితే ఈ పంటను పండించడంలో కొన్ని రకాల మెలుకువలు పాటిస్తే మంచి లాభాలను పొందవచ్చు అని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.దాని గురించి వివరంగా తెలుసుకుందాం..
వెల్లుల్లి పంటలో అనువైన రకాలు..
యమునా సఫెడ్ (G 50): రెబ్బలు గట్టిగ ఉంటాయి, బల్బ్ సంఖ్య 35-40 తెలుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. బల్బ్ వ్యాసం 3.5-4.0cm; TSS 38-40%; పొడి పదార్థం 40-41%. సగటు దిగుబడి హెక్టారుకు 15-20 టన్నులు. ఈ రకం భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
అగ్రిఫౌండ్ వైట్ (G 41): రెబ్వలు గట్టిగ, తెలుపు రంగులోఉంటాయి. వాటి యొక్క వ్యాసం 3.5-4.5cm మరియు బల్బ్ సంఖ్య 20-25. రబీ సీజన్‌లో పర్పుల్ బ్లాచ్ లేదా స్టెంఫిలియం బ్లైట్ సమస్య ఎక్కువగా లేని ప్రాంతాల్లో సాగుకు ఇది అనుకూలం. దిగుబడి హెక్టారుకు 13 టన్నులు..మంచి మెలుకువలు పాటిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు..
అగ్రిఫౌండ్ వైట్ (G 41): కాడలు గట్టిగ, తెలుపు రంగులోఉంటాయి. వెల్లుల్లి యొక్క వ్యాసం 3.5-4.5cm మరియు బల్బ్ సంఖ్య 20-25. రబీ సీజన్‌లో పర్పుల్ బ్లాచ్ లేదా స్టెంఫిలియం బ్లైట్ సమస్య ఎక్కువగా లేని ప్రాంతాల్లో సాగుకు ఇది అనుకూలం. దిగుబడి హెక్టారుకు 13 టన్నులు..
G 282: ఆకులు ఇతర రకాల కంటే వెడల్పుగా ఉంటాయి. బల్బులు పెద్ద పరిమాణం (5-6cm వ్యాసం), బల్బ్ సంఖ్య 15-16. మొత్తం కరిగే ఘన 38-42%, పొడి పదార్థం 39-43%, దిగుబడి 17.5-20 టన్నుల/హెక్టారు, ఎగుమతి ప్రయోజనాలకు అనుకూలం. ఇది ఉత్తర మరియు మధ్య భారతదేశంలో సాగు చేయడానికి అనుకూలం…
అగ్రిఫౌండ్ పార్వతి (G 313): హాంకాంగ్ మార్కెట్ నుండి సేకరించిన మెటీరియల్ నుంచి ఎంపిక చేయబడ్డది. ఇది దీర్ఘ కాళిక రకం మరియు ఉత్తరాది రాష్ట్రాల కొండలలో సాగుకు అనుకూలం. గడ్డలు పెద్ద సైజు (5-6 సెం.మీ. వ్యాసం), గులాబీ రంగుతో ఉంటాయి, బల్బ్ సంఖ్య 10-16, సాధారణ వ్యాధులను తట్టుకోగలవు. హెక్టారుకు సగటు దిగుబడి 17.5-22.5 టన్నులు. ఇది మధ్యస్థ నిల్వ మరియు ఎగుమతికి అనుకూలం..
ఈ రకాలు వెల్లుల్లి సాగులో అనువైన రకాలు..