తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు మంటలు పుట్టిస్తూ వేడి పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎండల తీవ్రత నేడు, రేపు మరింత పెరుగుతుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట తదితర జిల్లాల్లో ఈరోజు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండనుందని అంటున్నారు. అలాగే అత్యవసరం అయితే తప్ప రోడ్డు మీదకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.