తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఆదిలాబాద్, కుమ్రం భీం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని… ఉత్తర వాయువ్యం నుంచి వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చిరిస్తోంది. దీంతో తెలంగాణ సర్కార్ కూడా అప్రమత్తం అయింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా స్కూళ్ల టైమింగ్స్ తగ్గించాలని సీఎస్ సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్షర్లను ఆదేశించారు. ఎండల తీవ్రతపై ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని… అన్ని జిల్లాల్లో 108 వాహనాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఎండల తీవ్రతతో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్…. స్కూళ్ల టైమింగ్స్ తగ్గించాలని కీలక నిర్ణయం
-