గొప్ప మ‌న‌స్సు చాటుకున్న సూర్య! సిన‌త‌ల్లి కి సాయం

-

త‌మిళ స్టార్ హీరో సూర్య గొప్ప మ‌న‌స్సు చాటుకున్నాడు. జై భీమ్ సినిమా తో అంద‌రికీ తెలిసిన రియ‌ల్ సినత‌ల్లి అమ్మాళ్ కు స్టార్ హీరో సూర్య సాయం చేశాడు. అమ్మాళ్ పేరు హీరో సూర్య రూ. 10 ల‌క్ష‌ల ను బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసాడు. అంతే కాకుండా దాని నుంచి వ‌చ్చే నెల వారి వ‌డ్డీని అమ్మాళ్ కు అందేలా సూర్య చూశాడు. అయితే ఈ అమ్మాళ్ జీవితం లో జ‌రిగిన సంఘ‌ట‌నల ఆధారంగా జై భీమ్ అనే సినిమా తీశారు. ఈ సినిమా కొద్ది రోజుల క్రిత‌మే అమెజ‌న్ ప్రై అనే ఓటీటీ లో విడుద‌ల అయి విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటుంది.

అయితే ఈ సినిమా ద్వారా అమ్మాళ్ కు జ‌రిగిన అన్యాయం గురించి ప్ర‌పంచానికి తెలిసింది. దీంతో అమ్మాళ్ కు ప‌లువురు సెలబ్ర‌టీలు ముందుకు వ‌చ్చి సాయం చేస్తున్నారు. ఇప్ప‌టి కే స్టార్ కొరియో గ్రాఫ‌ర్, న‌టుడు , ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్ కూడా పార్వ‌తి అమ్మాళ్ కు ఇల్లు క‌ట్టిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. తాజాగా సూర్య కూడా సాయం చేశాడు. అయితే హీరో సూర్య గిరిజ‌నుల సంక్షేమానికి రూ. కోటి రూపాయాలు విరాళం అందించారు. దీంతో సూర్య గొప్ప మ‌న‌స్సు ను చూసి ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version