మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య. మొదటిసారి చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్నార. ఇంతకుముందు కూడా రామ్‌చరణ్ మూవీలో చిరంజీవి రెండు సార్లు కనిపించాడు కానీ అది తక్కువ టైమ్ ఉన్న పాత్రలు. కాగా కొరటాల డైరెక్షన్ వస్తున్న సినిమాలో వీరిద్దరూ ఫుల్ లెన్త్ రోల్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ మూవీపై అంచనాలను రెట్టింపు చేశాయి.
కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. దీంతో ఈ సినిమాను ఏ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడో అని అభిమానులు ఊహించేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీఅప్ డేట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీలో రామ్‌చరణ్ ఓ భారీ ఫైట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ నటుడు సోనూసూద్ తో రామ్‌చరణ్ చేసే ఫైట్ ఊహకు అందకుండా ఉంటుందని సమాచారం. మిర్చి లాగే మ్ చరణ్ – సోనూసూద్ వర్షంలో పోరాడే సన్నివేశాలు ఆధ్యంతం ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఇద్దరు బలవంతులు పోరాడితే ఎలా ఉంటుందో బాహుబలినిచూశాం ఇక అలాంటి ఫైట్ ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. అదే జరిగితే ఫ్యాన్స్ కు పండగే. ఇక ఆచార్య పనులు దాదాపు ఎండిడింగ్ కు వచ్చేశాయి. ఇక సినిమాని మే 14న రిలీజ్ చేయాలని టీం భావిస్తోంది. రిలీజ్‌కు ముందు ఇన్ని ట్విస్టులు ఇస్తున్న ఈ సినిమా.. ఇక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.కాగా కొవిడ్ కారణంగా సినిమాను వాయిదా వేస్తారా లేక రిలీజ్ చేస్తారా చూడాలి.