పోస్ట్ ఆఫీస్ నుండి సూపర్ స్కీమ్.. రూ.5 లక్షలకు రూ.10 లక్షలు..!

-

ఈరోజుల్లో చాలా మంది ఎన్నో రకాల స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు.ఇప్పటికే చాలా స్కీమ్స్ వున్నాయి. మీరు డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా…? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లో చాలా స్కీమ్స్ వున్నాయి. డబ్బులు పెడితే రాబడి పొందొచ్చు. రిస్క్ కూడా ఉండదు. పోస్ట్ ఆఫీస్ లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఏమి ఉండదు.

బ్యాంకుల్లో కనుక డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్ లో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒకటి. ఈ స్కీమ్ లో కనుక డబ్బులు పెట్టారంటే రెట్టింపు రాబడి పొందొచ్చు. మీరు పెట్టిన డబ్బు డబుల్ అవుతాయి. కేవీపీ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 115 నెలలు. కనీసం రూ.1000 ఉంటే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయవచ్చు.

ఇందులో మీరు ఎంతైనా సరే పెట్టవచ్చు. స్కీమ్‌పై 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. 115 నెలల్లో డబ్బు రెట్టింపు అయిపోతుంది. దీనిలో మీరు రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు అవుతుంది. సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్ ఏదైనా తెరవచ్చు. పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. పోస్టాఫీస్‌లో చాలా స్కీమ్స్ వున్నాయి. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది. ప్రతి నెలా చిన్న మొత్తంలో మీరు ఆ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version