Breaking : తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం..

-

తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత పెద్ద ఎత్తున విమర్శలకు వెల్లువెత్తాయి. దీంతో పలువురు తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేప్పట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కంప్యూటర్ డేటా ఆధారంగా రాష్ట్రంలో 19లక్షలకు పైగా రేషన్ కార్డులు రద్దు చేయడం ఏంటని సుప్రీం కోర్టు ఫైర్ అయ్యింది.

సరైన పరిశీలన లేకుండా లక్షల్లో రేషన్ కార్డులు ఎలా తొలగిస్తారని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2016 గైడ్ లైన్స్ ప్రకారం.. మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కార్డుల రద్దుకు ఎలాంటి ప్రమాణాలు పాటించారో అఫిడవిట్ సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news