Aamani: ఆమని నట వారసురాలు వచ్చేస్తోంది..హీరోయిన్‌గా నిలదొక్కుకునేనా?

-

తెలుగు చిత్ర సీమలో హీరోల తనయులు, కుటుంబ సభ్యులు, దర్శకుల, నిర్మాతల తనయులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, అలా ఎంట్రీ ఇచ్చిన వారందరూ అయితే సక్సెస్ కాలేకపోయారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ వారసులూ వచ్చారు. వారి పరిస్థితి కూడా అంతే..వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ముందకు సాగొచ్చు.. లేదంటే అంతే సంగతులు. కాగా, టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె నట వారసురాలిగా హృతిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నది.

సీనియర్ హీరోయిన్ ఆమని ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ ఆమె సత్తా చాటుతోంది. చక్కటి పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. కాగా, ఆమె మేనకోడలు హృతిక కూడా అదరగొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. బాల నటిగా పలు సినిమాల్లో నటించిన హృతిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నది.

అభిలాష్‌ భండారి హీరోగా తెరకెక్కుతున్న ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంలో కథానాయికగా హృతిక నటిస్తోంది. జీవీకే దర్శకత్వంలో చక్ర ఇన్ఫోటైన్మెంట్‌ బ్యానర్ పై వెంకటరత్నం ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ టైటిల్ పోస్టర్ బుధవారం రిలీజ్ చేశారు.


ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ లవ్ , సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సినిమా రాబోతున్నట్లు తెలిపారు. స్టోరిపైన కాన్ఫిడెంట్ గా ఉన్నట్ల పేర్కొన్నారు. ఈ పిక్చర్ కు సింధు కే ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తుండగా, జే. ప్రభాకర్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్.

Read more RELATED
Recommended to you

Latest news