బిల్కిస్ బానో దోషుల విడుదలపై సుప్రీం నోటీసులు

-

బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో దోషులను విడుదల చేసిన అంశంపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సుప్రీం..  కేంద్రం, గుజరాత్‌ ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష పెట్టడంపై వివరణ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

ఆగస్టు 15న బిల్కిస్‌ బానో అత్యాచారం కేసులో దోషులుగా ఉన్న 11 మందిని గుజ‌రాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై దేశ‌వ్యాప్తంగా దుమారం రేగింది. గుజ‌రాత్ ప్రభుత్వ తీరును విప‌క్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఈ నేప‌థ్యంలో దాఖ‌లైన పిటిష‌న్లను విచారించిన సుప్రీంకోర్టు, దోషుల విడుద‌లపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని.. కేంద్ర ప్రభుత్వం, గుజ‌రాత్ సర్కార్‌ను కోరింది. అలాగే ‘శిక్షా కాలం తగ్గింపు’ను పొందిన వ్యక్తుల్ని కూడా ఈ కేసులో కక్షిదారులుగా చేర్చాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version