Breaking : ఆసుపత్రిలో ప్రముఖ హీరో

-

పరిచయం అక్కర్లేని హీరో అబ్బాస్‌. తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్న, హిందీ సినిమాల్లో నటించిన అబ్బాస్‌.. ప్రేమదేశం సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చారు. అయితే.. మలయాళంలో కూడా ఆయన హీరోగా అనేక సినిమాల్లో నటించారు. తెలుగులో రాజా, అనగనగా ఒక అమ్మాయి, కృష్ణ బాబు, అల్లుడుగారు వచ్చారు, మాధురి, నీ ప్రేమకై, శ్వేత నాగు, పొలిటికల్ రౌడీ, చంద్రహాస్, అనసూయ, ఇది సంగతి, బ్యాంక్, మారో, అలా జరిగింది ఒక రోజు వంటి సినిమాల్లో కనిపించారు. అయితే 2015లో ఆయన తన సినీ కెరీర్ కి బ్రేక్ తీసుకొని తన కుటుంబంలో కలిసి ఇంగ్లాండ్ వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అయ్యారు. అయితే అబ్బాస్ ఇప్పుడు సర్జరీ చేయించుకున్నట్లుగా స్వయంగా ప్రకటించాడు.

was endeavoring to strengthen his mind'; Abbas underwent surgery

కొన్ని సంవత్సరాల క్రితం అబ్బాస్ తన భార్య ఎరామ్ అలీ, కుమార్తె ఎమిరా మరియు కుమారుడు ఐమాన్‌తో కలిసి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డాడు. అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అబ్బాస్ తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుడికాలికి శస్త్ర చికిత్స జరిగిందని, త్వరలోనే ఇంటికి చేరుకుంటానని పేర్కొన్నారు. “నేను ఆసుపత్రిలో ఉన్న సమయంలో నా మనస్సు ఏమాత్రం ప్రశాంతంగా లేదు, కానీ నేను లోపల ఉన్న భయాన్ని అధిగమించడానికి ప్రయత్నించాను, శస్త్ర చికిత్స అనంతరం త్వరలో ఇంటికి చేరుకోనున్నట్టు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news