టీఆర్‌ఎస్ ఎంపీలపై రాజ్యసభలో సస్పెన్షన్ వేటు వేసింది. రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టడంతో 19 మందిని వారం రోజులపాటు సస్పెన్షన్ విధించింది. సభలో నిరసనలు చేపట్టిన వారిపై వేటు వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరిశంకర్ తెలిపారు. వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ద్రవ్యోల్బణం, జీఎస్టీ, ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో టీఎస్ఎస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసింది.
టీఆర్ఎస్ ఎంపీలైన బడుగుల లింగయ్య యాదవ్, వద్ధిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావులను వారం రోజులపాటు సస్పెన్షన్ వేటు విధించింది. అలాగే టీఎంసీ ఎంపీలు సుస్మితా దేవ్, డాక్టర్ సంతనూ సేన్, డోలా సేన్‌లతో పాటు కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు కూడా ఉన్నారు. కాగా, సోమవారం లోక్‌సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలను వర్షాకాల సమావేశాల నుంచి పూర్తిగా సస్పెండ్ చేసింది. సభలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు చేపట్టారు.