పశ్చిమ బెంగాల్ లో అధికార త్రుణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది. తాజాగా బీజేపీనేత, ప్రధాన ప్రతిపక్ష నేత సువేందు అధికారి టీఎంసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ లో పరిస్థితులు కాశ్మీర్ కన్నా దారుణంగా ఉన్నాయంటూ.. సువేందు అధికారి ఆరోపించారు. బెంగాల్ ఎన్నికల తరువాత విపరీతమైన హింస కొనసాగింది. టీఎంసీ కార్యకర్తలు.. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.
బెంగాల్ లో పరిస్థితులు కాశ్మీర్ కన్నా దారుణంగా ఉన్నాయి.- బీజేపీ నేత సువేందు అధికారి
-