హీరోయిన్ కు కరోనా… చచ్చిపోవాలంటూ నెటిజెన్ల ట్రోలింగ్.

-

సాధారణంగా ఎవరైనా కరోనా బారిన పడితే .. కొలుకోవాని కోరుకుంటాం. శత్రువైన త్వరగా త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు కొందరు. ఇంత  భయపెడుతున్న కరోనా ఎవ్వరికీ సోకవద్దని ప్రార్థనలు చేస్తుంటారు. ఇప్పటికీ ఎంతో మంది ప్రజల ఆత్మీయులను, సన్నిహితులను కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది. సెలబ్రిటీలు, సినిమా స్టార్లు కరోనా బారిన పడితే.. వాళ్ల అభిమానులు తమ ఆరాధ్య వ్యక్తులకు ఏమీ కావద్దని పూజలు, ప్రార్థనలు చేస్తుంటారు.

ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ కు మాత్రం.. ఇది రివర్స్ అయింది. స్వరాభాస్కర్, బాలీవుడ్ లో చాలా ఫేమస్ హీరోయిన్. అయితే ఈమె యాక్టింగ్ కన్నా వివాదాల్లోనే ఎక్కువగా ఉంటుందనుకోండి. తాజాగా స్వరాభాస్కర్ కరోనా బారిన పడింది. ఆమె ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటుంది. అయితే ఈ విషయాన్ని షోషల్ మీడియాలో పెట్టింది. సాధారంగా అయితే గెట్ వెల్ సూన్ అని, త్వరగా కోలుకోవాలని నెటిజెన్లు కోరుకుంటారు. అయితే స్వరా భాస్కర్ విషయంలో మాత్రం నెటిజెన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.‘2022లో ఇదే బెస్ట్ న్యూస్’, ’ మీ మరణ వార్త కోసం ఎదురు చూస్తున్నాం’ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

స్వరాభాస్కర్ బీజేపీకి వ్యతిరేఖంగా మాట్లాడుతూ ఉంటుంది. బీజేపీ లీడర్లను చాలా సార్లు విమర్శించింది. దీంతో పాటు హిందుత్వవాదులపై కూడా విమర్శలు చేసింది. దీంతో ఈమెపై చాలాా మంది కోపంగా ఇలా ట్రోలింగ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version