ఆఫ్ఘనిస్తాన్ పై న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ.. సెమీస్ బరి నుంచి టీమిండియా ఔట్ !

-

టి20 ప్రపంచ కప్ లో భాగంగా… ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ జట్టు మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో.. న్యూజిలాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ పై ఏకంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి… 18.1 ఓవర్లలో టార్గెట్ ను చేధించింది న్యూజిలాండ్ జట్టు.

ఇక ఈ విషయం తో… టి20 ప్రపంచ కప్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది న్యూజిలాండ్ జట్టు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 40 పరుగులు గప్టిల్ 28 పరుగులు మరియు దివాన్ 36 పరుగులు చేసి.. న్యూజిలాండ్ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.

ఇక అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో ఏకంగా ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టార్గెట్ ను 18 ఓవర్లలోనే ఫినిష్ చేసింది న్యూజిలాండ్. ఈ మ్యాచ్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు 8 పాయింట్లు సాధించి.. సెమిస్ కు చేరగా… టీమిండియా ఇంటిదారి పట్టింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ లో నిరుత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version