తెలంగాణ ప్రభుత్వం పై గవర్నర్ తమిళ సై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో గవర్నర్ తమిళి సై జెండా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడానికి ప్రధాని అవకాశం కల్పించారని పేర్కొన్నారు గవర్నర్ తమిళి సై… రాజ్ భవన్ స్కూల్ లో భోజన సౌకర్యం కల్పించామని తెలిపారు.
భద్రాచలం, ఖమ్మం ఆదివాసులతో భోజనం చేసి…పౌష్టికాహారం ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాని చెప్పారు. నేను బాధపడను.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. నా సేవ తెలంగాణ ప్రజలకు అందిస్తున్నానని వెల్లడించారు గవర్నర్ తమిళి సై. రాష్ట్రానికి గవర్నర్ కాదు….మీ అందరి సహోదరినన్నారు గవర్నర్ తమిళి సై. ఎవ్వరు ఆపిన కూడ మీ అందర్ని కలుస్థున్నా.. అని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చురకలు అంటించారు గవర్నర్ తమిళి సై.