నేడు ఎన్టీఆర్ 26 వ వర్ధంతి. ఇక ఎన్టీఆర్ 26 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ,రామకృష్ణ, సుహాసిని ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అటు కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్టీఆర్ 26 వ వర్ధంతి కార్యక్రమాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ దూరంగా ఉండనున్నారు.
ఇక ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం రసూల్ పురా లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు బాలకృష్ణ.. కోవిడ్ నిబంధనలు ఉండడం వల్ల ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ రద్దు చేస్తూ టీడీపీ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక అటు ఇవాళ ఎన్టీఆర్ భవన్ లో లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించనున్నారు ట్రస్టు చైర్మన్ నారా భువనేశ్వరి. ఇది ఇలా ఉండగా… ఎన్టీఆర్ 26 వ వర్ధంతి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే” అంటూ పేర్కొన్నారు ఎన్టీఆర్.
తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే 🙏🏻 pic.twitter.com/msOmHdOtvl
— Jr NTR (@tarak9999) January 18, 2022