ఏపీలో ఇంతకాలం వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ పెద్దగా పోరాటాలు చేసిన సందర్భాలు లేవు. ఏదో అప్పుడుప్పుడు మాత్రం అధ్యక్షుడు సోము వీర్రాజు…జగన్‌పై సుత్తిమెత్తని విమర్శలు చేసుకుంటూ వచ్చారు. అటు బిజేపి నేతలది కూడా అదే పరిస్తితి. కానీ తాజాగా బద్వేలు ఉపఎన్నిక పోరు మొదలయ్యాక బిజేపికి ఊపు వచ్చింది. అసలు ఆగకుండా వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతుంది.
లాగో బద్వేలు ఉపఎన్నిక పోరు నుంచి టిడిపి, జనసేనలు తప్పుకున్న విషయం తెలిసిందే. కానీ బిజేపి బరిలో దిగింది. అలాగే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసింది. అసలు బద్వేలులో బిజేపికి పెద్దగా ఓట్లు పడవని తెలుసు. గత ఎన్నికల్లోనే ఒక 700 ఓట్లు పడ్డాయి. కానీ ఈ సారి టిడిపి బరిలో లేకపోవడంతో, ఆ పార్టీ ఓట్లు అయినా కనీసం పడేలా చేసుకుని డిపాజిట్ దక్కించుకోవాలని చూస్తోంది.
కానీ పైకి మాత్రం వైసీపీని ఓడిస్తామన్నట్లు బిజేపి నేతలు మాట్లాడుతున్నారు. పైగా బద్వేలు ఉపఎన్నిక బాధ్యతలని చూసుకుంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బిజేపి టార్గెట్ చేసింది. స్వేచ్ఛగా ఎన్నికలు జరపడానికి వైసీపీ భయపడుతోందని, ముగ్గురు మంత్రులు, ముగ్గురు చీఫ్ విప్‌లు, ఏడుగురు ఎమ్మెల్యేలు బద్వేలు వదిలి వెళ్లండని బిజేపి నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు.
అసలు బిజేపిని వైసీపీ పట్టించుకోవడం లేదు….టిడిపి ఎలాగో లేదు కాబట్టి హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు లేవు. అలాంటప్పుడు స్వేచ్చగా అని బిజేపి ఎందుకు మాట్లాడుతుందో క్లారిటీ లేదు. పైగా బద్వేలు అభివృద్ధి బిజేపితోనే సాధ్యమని, కాబట్టి తమకు ఒక ఛాన్స్ ఇవ్వండని బిజేపి నేతలు మాట్లాడుతున్నారు. అసలు కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి బిజేపి చేసింది ఏమి లేదు….ఇంకా బద్వేలుకు ఏం చేస్తారనేది ఏపీ ప్రజల మాట. కాబట్టి బద్వేలు పోరులో బిజేపి హడావిడి చేసినంత మాత్రాన ఉపయోగం లేదని తెలుస్తోంది. ఆ పార్టీ నోటా ఓట్లని దాటితే బెటర్.