21న మునుగోడు బహిరంగ సభ.. హాజరుకానున్న అమిత్‌ షా, యోగి

-

ఈ నెల 21 న మునుగోడు బిజెపి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తరుణ్ చుగ్ పేర్కొన్నారు. మునుగోడు సభలో అమిత్ షా పాల్గొంటారు.. ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికి అన్యాయం చేస్తోంది… కేసీఆర్ పాలనలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడుతారని పేర్కొన్నారు. తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు.. గత ఏడాదిగా తెలంగాణ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

బిజెపి ఎంపీలపై పోలీసులతో దాడి చేయించారు.. రెండురోజులుగా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది కేసీఆర్, టీఆరెస్ అన్నారు. కేసీఆర్ చేతిలోనుంచి అధికారం పోతుందనే భయంతో వ్యవహారిస్తున్నారు.. వచే ఎన్నికల్లో గెలిచి బిజెపి అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేశారు. పాదయాత్ర పై జరిగిన దాడిని ఖండిస్తున్నానని.. పోలీసులు సైతం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు. కేసీఆర్ సాయంత్రం మాట్లాడే మాటలపై ఏం చెప్తామన్నారు. బిజెపి బహిరంగ సభకు యోగి కూడా వస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news