తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాల్లో ఎక్కువ బలం ఉందనే చెప్పాలి. మొదట నుంచి గోదావరి జిల్లాల్లో టిడిపికి మంచి ఫలితాలే వస్తున్నాయి. కానీ గత ఎన్నికల్లోనే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడిపి దెబ్బతింది. రెండు జిల్లాలు కలిపి 34 సీట్లు ఉంటే టిడిపి కేవలం 6 సీట్లు గెలుచుకుంది. అలాగే 5 ఎంపీ సీట్లలో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు టిడిపి నిదానంగా బలపడుతూ వస్తుంది. చాలా చోట్ల పార్టీ పికప్ అయింది.అలాగే జనసేనతో పొత్తు ఉంటే రెండు జిల్లాలో టిడిపికి మంచి ఫలితాలు వస్తాయి. పొత్తు లేకపోయినా టిడిపి ఆధిక్యం సాధించే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ అసెంబ్లీ సీట్లు పక్కన పెడితే..ఎంపీ సీట్లలో టిడిపి పరిస్తితి ఇంకా మెరుగు పడాలి. పార్టీ పరంగా బలంగానే ఉంది గాని..నాయకత్వ పరంగా టిడిపి వీక్ గా ఉంది.
ఐదు పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్ధులు కనిపించడం లేదు. పశ్చిమలో ఉన్న నరసాపురంలో టిడిపి తరుపున ఎవరు పోటీ చేస్తారో క్లారీటీ లేదు. పొత్తు ఉంటే ఆ సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారం ఉంది.ఇటు ఏలూరు ఎంపీ సీటు ఈ సారి మాగంటి బాబుకు ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. దీంతో ఇక్కడ కొత్త అభ్యర్ధి కోసం వేట నడుస్తోంది. అటు రాజమండ్రిలో గత ఎన్నికల్లో మురళీమోహన్ కోడలు రూప పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి అక్కడ ఎవరు పోటీ చేస్తారో తెలియదు. కాకినాడలో చలమలశెట్టి సునీల్ పోటీ చేసి ఓడిపోయి, వైసీపీలోకి జంప్ చేశారు. దీంతో ఆసీటు ఖాళీగా ఉంది.
ఇక అమలాపురం సీటులో ఉన్న బాలయోగి వారసుడు హరీష్‌ని పి.గన్నవరం సీటుకు పంపించారు. దీంతో అమలాపురం ఎంపీ సీటు ఖాళీ. మొత్తం 5 ఎంపీ సీట్లు ఖాళీగానే ఉన్నాయని చెప్పవచ్చు.