అంబటి రాంబబు ఏమన్నా శాస్రవేత్తా : బోండా ఉమ

మరోసారి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా దొరకని 106 కొత్త బ్రాండ్స్ వచ్చాయని ఆరోపించారు. కొత్త కల్తీ మద్యం తాగి పెద్ద ఎత్తున చనిపోయారని, మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్టులు చెబుతుంటే.. ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదని ఆయన బొండా ఉమ మండిపడ్డారు. అంబటి రాంబబు ఏమన్నా శాస్రవేత్తా అవి మంచి బ్రాండ్స్ అని చెప్పడానికి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బొండా ఉమ.

Jagan Destroying Amaravati out of Greediness: Bonda Uma

వైసీపీ నాయకులు చేతిలోకి తీసుకుని కల్తీ మద్యం తయారు చేస్తున్నారని, అన్నీ బ్రాండ్లను టెస్ట్ లు చేయించడానికి మేము సిద్ధం ప్రభుత్వం కూడా సిద్ధమేనా… అని ఆయన సవాల్‌ విసిరారు బొండా ఉమ. దమ్ముంటే బ్రాండ్లను టెస్టులు చేయించగలరా..?అని ఆయన ప్రశ్నించారు. మద్యం వల్ల వచ్చే డబ్బు తాడేపల్లి ప్యాలెస్సుకు వెళ్తోందన్న బొండా ఉమ.. అంబటి లాంటి వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కల్తీ మందుతో చాలా మంది మృతి చెందారని టీడీపీ చెబుతూనే ఉందని, జే బ్రాండ్లపై ఆధారాలతో సహా టీడీపీ నిరూపించిందన్నారు బొండా ఉమ.