వైసీపీ నాయకులకు నేను మూర్ఖున్ని… ఎవ్వరిని వదిలిపెట్టబోం: నారా లోకేష్

-

గుంటూర్ జిల్లా తుమ్మపూడిలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అత్యాచారం హత్యకు గురైన బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ నాయకుడు లోకేష్ పర్యటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరుగింది. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని లోకేష్ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే దిశా చట్టం కింద 21 రోజుల్లో ఉరిశిక్ష వేయాలని హోంమంత్రికి సవాల్ విసిరారు. చీరలు కట్టుకోమని ఓ మహిళా మంత్రి మహిళలను కించపరుస్తున్నారని లోకేష్ విమర్శించారు. బాధితులకు అండగా నిలబడితే మహిళా కమిషన్ మాకు నోటిసులు పంపిస్తున్నారంటూ విమర్శించారు. వైసీపీ నాయకులకు నేను మూర్ఖున్ని.. ఎవ్వరిని వదిలిపెట్టబోం అని లోకేష్ హెచ్చరించారు. ఏపీలో వ్యవస్థలను వైసీపీ భ్రష్టు పట్టించారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ గారు పోస్ట్ మార్టం జరగకముందే గ్యాంగ్ రేప్ జరలేదని అంటున్నారని.. ఈ విషయంలో ఎవరి ఒత్తడి ఉందని ప్రశ్నించారు. కాల్ డేటా రికార్డులు బయటపెట్టాలని ఎస్పీని డిమాండ్ చేశారు. ఈకేసులో ఎవరి నుంచి ఒత్తడి ఎదురువుతుందని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news