నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ

-

తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నిలబెట్టడమే లక్ష్యంగా నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ “తెలుగుదేశం” పార్టీ. 1982 మార్చి 29న పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది ఈ పార్టీ. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది. ఆత్మగౌరవంతో.. ఢిల్లీ లోనూ రాజకీయాలు చేశారు ఎన్టీఆర్. ప్రధాన ప్రతి పక్షంగా వ్యవహరించిన ఒకే ఒక్క ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. ఆ తర్వాత ఓటమిని ఎదుర్కొని మళ్ళీ గెలిచి.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకి వచ్చి ప్రజల కోసం నిలబడుతూనే ఉంటుంది. కాగా నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ సభ వేదిక వద్దకు చేరుకున్నారు.

Chandrababu attends TDP 41st foundation day meeting

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా.. ఆత్మగౌరవ నినాదంతో పుట్టి, తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు అని ఆయన ట్వీట్ చేశారు. అన్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్ అని అన్నారు. అలానే తెలుగుదేశం పార్టీ కూడా ట్విట్టర్ ద్వారా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది. ‘ప్రతీ అడుగూ ప్రజల కోసం.. ఈ 41 సంవత్సరాల ప్రస్థానం.. ప్రగతి కోసం మన తెలుగుదేశం.. ఇది తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు ప్రజలందరికీ టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు.. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, పార్టీ కోసం ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తల, నాయకుల కుటుంబాలకు పాదాభివందనాలు.. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు.. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్’ అని ట్వీట్ చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news