కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాయ్ బరేలికి క్యూ కట్టారు. రేపు లేదా ఎల్లుండి రాయ్ బరేలిలో ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిసినందున రాయ్ బరేలిలో ప్రచారానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లారు. ఇప్పటికే రాహుల్ గాంధీకి మద్దతుగా సీతక్క, వీ. హనుమంతరావు తదితరులు ప్రచారం మొదలు పెట్టారు.
నేటి మధ్యాహ్నం మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ రేపు రాయ్ బరేలి వెళ్లనున్నారు. రాజ్యసభ ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ పైర్ బ్రాండ్ రేణుక చౌదరి రాయ్ బరేలికి వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ కోసం ప్రచారం చేయడానికి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు కూడా బయల్దేరారు. తెలంగాణ ఎన్నికల్లో విజయానికి రాహుల్ గాంధీ కృషి చేశారు. ఇప్పుడు రాహుల్‌కి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలిపారు.