నాగపూర్ టెస్టులో రెండో రోజు ఆట… భారత్ ఆధిక్యం

-

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగపూర్ లో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆటలో భారత్ ఆధిక్యం 144 పరుగులు తీసింది. ఆట చివరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. బ్యాటింగ్ కు కష్టసాధ్యమైన ఇక్కడి పిచ్ పై ప్రస్తుతానికి భారత్ కు 144 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. గాయం నుంచి కోలుకుని దాదాపు 6 నెలల తర్వాత బరిలో దిగిన జడేజా బౌలింగ్ లో 5 వికెట్లు తీయడమే కాదు, బ్యాటింగ్ లోనూ అర్ధసెంచరీతో మెరిశాడు. 240 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ ను జడేజా, అక్షర్ పటేల్ జోడీ ఆదుకుంది.

IND vs AUS highlights 1st Test Day 2: Ravindra Jadeja, Axar Patel slam  fifties to take India to 321/7 at Stumps | Sports News,The Indian Express

ఇద్దరూ అర్ధసెంచరీలతో రాణించి జట్టుకు విలువైన పరుగులు జోడించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్ మర్ఫీ 5, కెప్టెన్ పాట్ కమిన్స్ 1, నాథన్ లైయన్ 1 వికెట్ తీశారు. అంతకుముందు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన కంగారూలు పిచ్ పరిస్థితిని అంచనా వేయలేక బ్యాటింగ్ ఎంచుకుని బోర్లా పడ్డారు. టీమిండియా స్పిన్నర్లు అద్భుతంగా రాణించి ఆసీస్ పనిబట్టారు. రెండో రోజు ఆట చివరికి 7 వికెట్లకు 321 రన్స్ చేసిన భారత్.

 

Read more RELATED
Recommended to you

Latest news