ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా జట్టు సిద్ధం

-

ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా సీనియర్ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జాబాస్టన్ వేదికగా శుక్రవారం జరిగే కీలక పోరులోనూ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1తో సిరీస్ గెలవాలనుకుంటుంది. దీంతో ఇంగ్లీష్ గడ్డపై మరోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని ఉత్సాహంగా ఉంది. టీమిండియాలో కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడం.. కెప్టెన్ రోహిత్‌ శర్మకు కరోనా రావడం.. పూజారా, కోహ్లీ ఫామ్‌లపై అనుమానాలు కనిపిస్తున్నాయి. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ గతవారమే న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్ క్లీన్‌స్పీప్ చేసింది. దీంతో టీమిండియా ఆశలన్నీ ఇప్పుడు బౌలింగ్‌పైనే ఆధారపడింది.

టీమిండియా జట్టు
టీమిండియా జట్టు

గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు ఆటలు పూర్తయ్యేసరికి భారత్ ఒక మ్యాచ్ డ్రా చేసుకుని 2-1 ఆధిక్యంలో నిలిచింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు ఇప్పుడు తిరిగి నిర్వహిస్తున్నారు. అప్పుడు భారత్ బౌలర్లు విజృంభించడంతో ఓవల్, లార్డ్స్ మ్యాచుల్లో టీమిండియా గెలిచింది. బుమ్రా 4 మ్యాచుల్లో 18, మహ్మద్ సిరాజ్ 4 మ్యాచుల్లో 14, మహ్మద్ షమి 3 మ్యాచుల్లో 14, ఠాకూర్ 2 మ్యాచుల్లో 7 వికెట్లు తీసి జట్టు విజయానికి కారణమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news