కరోనా వైరస్ మానవాళిని వదలనంటోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. అయితే.. తెలంగాణలోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 27,841 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 279 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 172 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 62, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 119 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో తాజా మరణాలేవీ సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటిదాకా 7,95,572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,89,680 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,781 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మృతి చెందారు. అయితే కరోనా ఫోర్త్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. మరో సారి కరోనా వైరస్ రెక్కలు చాస్తుండటం ఆందోళన కలిగించే విషయం.