ముగిసిన ఇండియా బ్యాటింగ్‌.. సఫారీల ముందు భారీ టార్గెట్

-

దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20 మ్యాచ్ లో దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్ కు దిగిన దినేశ్ కార్తీక్ 27 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 2 సిక్సులున్నాయి. కార్తీక్ కు తోడు హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 46 రన్స్) కూడా ధాటిగా ఆడడంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఈ పోరులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఎప్పట్లాగానే దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.

Dinesh Karthik scores 55 vs South Africa in 4th T20 at Rajkot india vs  south africa twitter reacts | Cricket News – India TV

కిషన్ 26 బంతుల్లో 27 పరుగులు చేసి నోర్జే బౌలింగ్ లో వెనుదిరిగాడు. వన్ డౌన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (4) నిరాశపరిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా తన పేలవ ఫామ్ కొనసాగిస్తూ 17 పరుగులు చేసి కేశవ్ మహరాజ్ కు వికెట్ అప్పగించాడు. ఆ తర్వాత, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ జోడీ సఫారీలపై విరుచుకుపడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్ 1, ప్రిటోరియస్ 1, నోర్జే 1, కేశవ్ మహరాజ్ 1 వికెట్ సాధించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news