గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ అసెంబ్లీని కూడా తాకింది. గులాబ్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కుంభవ్రుష్టి కురుస్తోంది. దీంతో ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ వర్షకాల సమావేశాలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడనున్నాయి. మళ్లీ తిరిగి అక్టోబర్ 1న సమావేశాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలయ్యి కేవలం 2 రోజులు మాత్రమే జరిగాయి. మొదటి రోజు కేవలం ఇటీవల ఇటీవల మరణించిన శానసభ్యులకు సంతాప తీర్మాణంతో ముగిసింది. రెండో రోజు సమావేశాలు హైదరాబాద్ అభివ్రుద్ధి, తెలంగాణలో ఐటీ డెవలప్మెంట్, పారిశ్రామిక అభివ్రుద్ధిపై చర్చించారు. తెలంగాణలో జరుగుతున్న డెవలప్మెంట్ రాష్ట్ర ఐటీ, పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి కేటీాఆర్ సుధీర్ఘంగా చర్చించారు. రాబోయే సమావేశాల్లో ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ ప్రజాసమస్యలపై పోరు మొదలుపెట్టే అవకాశం ఉంది. పోడు భూములు, ధరణి సమస్యలు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
అసెంబ్లీని తాకిన గులాబ్.. 3 రోజులు వాయిదా
-