జూన్ 21న తెలంగాణ కేబినెట్ సమావేశం

-

జూన్ 21న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో మంత్రివర్గ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారుచేసే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది.

రాబోయే 5 సంవత్సరాలకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న అంశంపై కూడా క్యాబినెట్ లో చర్చించనున్నట్టు తెలుస్తోంది.విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపైనా చర్చించే అవకాశం ఉంది. అలాగే పంటల బీమా, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ పై కూడా క్యాబినెట్ లో చర్చించనున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version