నిరుద్యోగులు చాలా మంది 9 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని.. టీచర్ నోటిఫికేషన్ లేదని, బీఎడ్ చేసిన వారు, ఇతర ఉద్యోగాలకు చూసే వారికి వయోపరిమితి దాటిపోయిందని వారికి కూడా న్యాయం చేయాలని కోరారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సీఎం కేసీఆర్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నామని.. ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. 2018 ఎన్నికల్లో మానిఫెస్టోలో రూ. 3116 నిరుద్యోగ భ్రుతి ఇస్తామని అన్నారని.. దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. దానికి అనుకూలంగా మీ ప్రకటన వస్తుందని ఎదురుచూస్తున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మీ ప్రకటన రాగానే నేనే స్వయంగా వెళ్లి మీకు భువనగిరిలో పాలాభిషేకం చేస్తామని అన్నారు. మాకు ఇకేం అవసరం లేదని నిరుద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భ్రుతి, వయోపరిమితిపై ప్రకటన చేయాలని కోరారు. ఇలా చేస్తే మిమ్మల్ని ఎప్పుడూ విమర్శించమని కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటిస్తామని.. ఆశిస్తున్నామని బట్టి విక్రమార్క అన్నారు.
అదే చేస్తే.. సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తాం: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
-