4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే

-

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడున్న టిమ్స్ దవాఖానను ప్రజా అవసరాలకు అనుగుణంగా మార్పు చేసి, దాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అధునీకరించాలని, దానికి తోడుగా ఇంకా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని, మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కేబినెట్ మంజూరు చేసింది. వీటిలో చెస్ట్ హాస్పటల్ ప్రాంగణంలో ఒకటి, ఈ మధ్యనే గడ్డి అన్నారం నుంచి షిప్టు చేసిన ప్రూట్ మార్కెట్ ప్రాంగణంలో రెండవది, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఓఆరార్ మధ్యలో మూడవది. టిమ్స్ ను కలిపి మొత్తం నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది.

అలాగే రాష్ట్రంలో గత సంవత్సరం వరి ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నుల పైచిలుకుగా ఉందని, వ్యవసాయ శాఖ కేబినెట్ కు తెలిపింది. ఈసారి ఇప్పటికే ఈ నెలలో సాధారణ వర్షపాతం కంటే 60 శాతం ఎక్కువ వానలు పడ్డాయని, గత సంవత్సరం కంటే 5 శాతం ఎక్కువగా వర్షాపాతం నమోదయ్యిందని, వ్యవసాయ శాఖ కేబినెట్ కు వివరించింది. గీత కార్మికులకు, చేనేత కార్మికులకు త్వరితగతిన బీమా అందించడానికి చర్యలు తీసుకోవాలని, మత్స్య కార్మికులకు, గీత కార్మికులకు అందించాల్సివున్న ఎక్స్ గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని, వివిధ వృత్తి కులాలకు ఎంబీసీ కర్పోరేషన్ కు నిధులు విడుదల చేయాలని కేబినెట్ ఆదేశించింది. రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగానే, వృత్తి కులాలకు కూడా సత్వరమే బీమా చెల్లింపులు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version