కేసీఆర్ పై మరోసారి గవర్నర్ తమిళిసై ఫైర్

-

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. రాజ్‌భవన్‌లో తనకయ్యే ఖర్చును మొత్తం తానే భరిస్తున్నట్లు బయటపెట్టారు. ప్రతినెలా తనకయ్యే ఖర్చును తానే సొంతంగా చెల్లిస్తున్నానని, ప్రభుత్వ సొమ్మును ఉపయోగించుకోవడం లేదని తమిళి సై స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆ కాలంలో చేసిన పనులపై ‘రీ డిస్కవరింగ్‌ సెల్ఫ్‌ ఇన్‌ సెల్ఫ్‌లెస్‌ సర్వీస్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేసే కార్యక్రమం చెన్నైలో నిర్వహించారు.

గణతంత్ర దినోత్సవం రోజున తనని జెండా ఆవిష్కరించనివ్వలేదని, ప్రసంగం కూడా చేయనివ్వలేదని గవర్నర్ అన్నారు. అయినా తన పని తాను చేసుకుంటూ పోతున్నానని తెలిపారు. గవర్నర్‌గా తనకి అధికారం ఉన్నా ప్రత్యేక విమానాన్ని తన ప్రయాణానికి ఉపయోగించలేదని చెప్పారు. తింటున్న భోజనానికి కూడా తెలంగాణ రాజ్‌భవన్‌కి నగదు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. తనకు తెలిసిన ఓ వ్యక్తి ‘తమిళిసై ఎప్పుడూ తమిళనాడులోనే ఉంటున్నారు. ఆమె గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ, ఇన్‌ఛార్జి ఎల్జీగా ఉన్న పుదుచ్చేరి ఏమవ్వాలి’ అని అన్నారని అన్నారు.

పుదుచ్చేరికి వెళ్లినప్పుడు మాజీ సీఎం నారాయణస్వామి తనపై ‘తెలంగాణలో తరిమికొట్టారా? తరచూ ఇక్కడే ఉంటున్నారు’ అని విమర్శలు చేసినట్లు తమిళిసై తెలిపారు. ఎవరు ఎన్ని చెప్పినా తాను తమిళనాడు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటానని చెప్పారు. తనకి రాష్ట్రపతి అభ్యర్థి అవకాశం వచ్చినా ప్రజలతో కలిసి ఉండాలని భావించానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news