డిసెంబర్ వరకు కరోనా ఉంటుంది..మాస్క్ ధరించాల్సిందేనని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోన కేసుల సంఖ్య 66 శాతం పెరిగిందని.. గత వారం తెలంగాణలో 355 కేసులు నమోదు అయ్యాయని పేర్కొంది. ఈ వారం 556 కేసులు నమోదు అయ్యాయని.. తెలంగాణలో వారం రోజుల్లో 811 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది.
పాజిటివిటి రేటు 1 శాతానికి పెరిగిందని.. కేసుల సంఖ్య పెరుగుతున్న.. మరణాలు సున్నా.. ఆస్పత్రుల్లో అడ్మిషన్లు కూడా లేవని తెలిపింది. వ్యాక్సినేషన్ కవరేజ్ 100 శాతం ఇచ్చుకున్నామని.. సబ్ వేరియంట్స్ కొంత ఇబ్బంది పెడుతున్నాయని స్పష్టం చేసింది.
కరోనా మొత్తం ఎలిమినెట్ కాలేదని.. కేసులు పెరిగినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వచ్చే డిసెంబర్ వరకు కరోనా ఇలాగే ఉండే అవకాశం ఉందని… మాస్క్ ధరించాలి.. భౌతిక దూరం పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది. రెగ్యులర్ ఫ్లూస్ తో పాటు వచ్చే లక్షణాలతో పాటు జ్వరం, తలనొప్పి, స్మెల్ లేకపోవడం ఉంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండని తెలిపింది వైద్యారోగ్య శాఖ.