గడ్డి అన్నారం మార్కెట్ వెంటనే తెరవాలని హైకోర్ట్ ఆదేశం

-

గడ్డి అన్నారం మార్కెట్ ను వెంటనే తెరవాలని హైకోర్ట్ ఆదేశాలు జారీచేసింది. మార్కెట్ లో ఉన్న సామాగ్రిని తీసుకోవడానికి మాత్రమే ఓపెన్ చేయాలంది హైకోర్ట్. పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని గతేడాది సెప్టెంబర్ 25 మూసివేశారు అధికారులు. ట్రాఫిక్​ సహా ఇతర కారణాలతో ఈ పండ్ల మార్కెట్​ను నగర శివారులోని కొహెడ్​కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొహెడ్​లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేంతవరకు బాటసింగారంలోని లాజిస్టిక్ పార్క్​లో తాత్కాలికంగా ఏర్పాటుచేయాలని భావించింది. ఈ స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయంపై కమీషన్​ ఏజెంట్లు సహా చిరు వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే ఒక్కసారిగా మూసివేయడంతో మార్కెట్ లోని ఉన్న ఫర్నీచర్, ఏసీ సామాగ్రి అక్కడే ఉంది. దీంతో మార్కెట్ సిబ్బంది హైకోర్ట్ ను ఆశ్రయించింది. ఈరోజు విచారించిన హైకోర్ట్ వెంటనే మార్కెట్ ఓపెన్ చేసి సిబ్బంది సామాగ్రిని తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిచింది. తమ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని  మార్కెటింగ్​శాఖను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news