“నయీం డైరీ”సినిమాలో లిప్ లాక్.. తెలంగాణ హై కోర్టు నోటీసులు

-

నయీం డైరీ చిత్రం విడుదల పై తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. నయీం డైరీ చిత్రం లో గాయని బెల్లి లలిత క్యారెక్టర్ అభ్యంతరకరంగా చిత్రీకరించారంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించారు లలిత కుమారుడు సూర్య ప్రకాష్. 1999 లో బెల్లి లలిత..దారుణ హత్యకు గురయ్యారు. బెల్లి లలితను అప్పట్లో నయీం హత్య చేయించాడంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు చేస్తున్నారు.

తాజాగా నయీం డైరీ చిత్రంలో బెల్లి లలిత క్యారెక్టర్ అయిన ‘లత’ ను నయీం లిప్ కిస్ చేసే దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే ఇవాళ నయూం డైరీ చిత్రం రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే.. చిత్రం నిలుపుదల చేయాలంటూ సూర్య ప్రకాష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో చిత్రం డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు నోటీసులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర హై కోర్టు. అయితే ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది హై కోర్టు. అప్పటి వరకు నయీం డైరీ చిత్రం ప్రదర్శన పై స్టే విధించింది హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version