ధాన్యం కొనుగోలు పై.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు లో పిల్ దాఖలు అయింది. ధాన్యం కొనుగోలుపై లా విద్యార్థి బొమ్మనగరి శ్రీకర్ పిల్ ధాఖలు చేసారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పిటిషనర్…
ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఏ చట్ట ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలో ఈ సందర్భంగా చెప్పాలని పేర్కొంది హైకోర్టు. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.

కేంద్రం ప్రకటించిన కనీసం మద్దతు ధర రైతులకు అందేలా చూడాలన్న పిటీషనర్.. ధాన్యం దళారుల దోచుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తూ చనిపోయిన 700 రైతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ కావొచ్చన్న హైకోర్టు.. పత్రికల కథనం ప్రకారం ధర్నా లో చనిపోయిన ప్రతి రైతు కుటుంబాలకు 3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొంది. జనవరి చివరి వరకు ధాన్యం కొనుగోలు చేస్తూనే ఉంటామని ఎజి పేర్కొన్నారు.. ఎజి వాదనను పరిగణనలోకి తీసుకుని ధాన్యం కొనుగోలు కు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. జనవరి మూడవ వారం లోపు కౌంటర్ ధాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version