క్యాసినో వ్యవహారంపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి

-

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన క్యాసినో వ్యవహారంలో మంత్రి మల్లారెడ్డి పేరు వినిపించడంపై ఆయన స్పందించారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన మాధవ రెడ్డి మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన కారు స్టిక్కర్​ పై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆ స్టిక్కర్ తనదేనని స్పష్టం చేశారు. కానీ క్యాసినోకు తనకు సంబంధం లేదని చెప్పారు.

క్యాసినోలు నిర్వహిస్తూ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐఎస్ సదన్‌కు చెందిన ప్రవీణ్, బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న మాధవరెడ్డితో పాటు పలువురు ఏజెంట్ల ఇళ్లల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో మాధవరెడ్డి కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్​ ఉన్నట్టు.. అది మంత్రి మల్లారెడ్డికి సంబంధించినదిగా అధికారులు గుర్తించారు.

మేడ్చల్ జిల్లా బోడుప్పల్​లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి.. ఎమ్మెల్యే స్టిక్కర్​ విషయంపై వివరణ ఇచ్చారు. మాధవరెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో దొరికిన స్టిక్కర్ తనదే అని మంత్రి స్పష్టం చేశారు. అయితే.. ఆ స్టిక్కర్​ మాత్రం మార్చి 2022 నాటిదని పేర్కొన్నారు. దాన్ని మూడు నెలల క్రితమే తీసేసి బయట పడేశామని.. అది ఎవరో పెట్టుకుంటే తనకేం సంబంధమని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version