తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్!

-

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో అదో సెన్సేషన్ అయింది. అయితే టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నట్లు సమాచారం. తెలంగాణ ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్ మోగే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఈ సంస్థ ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కొన్ని డిమాండ్లను యాజమాన్యం ముందుకు తీసుకువచ్చాయి. అయితే యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే మూడు సార్లు సమ్మె నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ మరోసారి సమ్మె బాట పట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆర్టీసీ యాజమాన్యం వీలైనంత త్వరగా చర్చలు జరిపేందుకు ముందుకు రాకపోతే సమ్మె సైరన్ మోగించక తప్పదని జేఏసీ నేతలు అంటున్నారు. అయితే మూడు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం.. చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని కోరినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం.. లేబర్ కమిషనర్‌తో చర్చలు జరిపే అవకాశం కల్పించినా, ఆర్టీసీ యాజమాన్యం అందులో పాల్గొనకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగింది. ఈ నేపథ్యంలోనే వారంతా సమ్మె బాట పట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news