తెలంగాణ రాష్ట్రంలో ఎండలు భగభగ మండిపోతున్నాయి. మొన్నటి వరకు చలి విపరీతంగా ఉండగా… గత వారం రోజుల నుంచి.. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఇక ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులను నిర్వహించబోతోంది.
మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట తరగతులు మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి…. ప్రభుత్వానికి ఇచ్చారు. ఇక సీఎం కేసీఆర్ దీనిపై ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు.
ఉదయం 7:45 గంటల నుంచి 12 గంటల వరకు అంటే రోజూ నాలుగున్నర గంటల పాటు తరగతులు నిర్వహించాలని అది విద్యా శాఖ ఆలోచనగా సమాచారం అందుతోంది. దీనికి మీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ ఒంటిపూట బడులు.. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అంతే కాదు జూన్ 12వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా తెలుస్తోంది.