హైదరాబాద్ లోని మణికొండ జాగీర్ లో ఉన్న 1,654.32 ఎకరాల భూమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయని దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీకం కోర్టు తీర్పును ఇచ్చింది. కాగ మణికొండ జాగీర్ లోని 1,654 ఎకరాల భూమి తొమ్మిది సంవత్సరాల వివాదం నేటికి మూగింపు లభించింది. అయితే 2006 లో ఏపీ వక్ఫ్ బోర్డు మణికొండ జాగీర్ లని 1,654 ఎకరాల భూమి తమదే అంటూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని ఏపీఐఐసీ, ల్యాంకో హిల్స్, టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ, ఐఎస్బీ, జన చైతన్య హౌసింగ్ ప్రైవేట లిమిటెడ్ వంటి సంస్థలకు భూమిని అప్పగించింది.
దీంతో వక్ఫ్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ అప్పటి ఏపీ హై కోర్టులో ప్రభుత్వంతో పాటు ఏపీఐఐసీ, ల్యాంకో హిల్స్ తో పాటు మరి కొన్ని సంస్థలు పిటిషన్ దఖాలు చేశాయి. అయితే ఏపీ హై కోర్టు ఈ భూములు వక్ఫ్ బోర్డు కే చెందుతాయని తీర్పును ఇచ్చింది. దీంతో 2012 లో ఏపీ ప్రభుత్వం తో పాటు ఈ సంస్థలు హై కోర్టు తీర్పును సవాలు చేస్తు.. సుప్రీం కోర్టులో పిటిషన్లును వేశారు. ఇప్పటి వరకు విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. తాజా గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును ఇచ్చింది.